అక్కినేని నాగేశ్వర రావు(ఎ ఎన్ ఆర్ ) |
అందమైన ఆహార్యం
చదువుకన్నా సంస్కారం
ఉన్నతమైన ఆలోచన
ఉదాత్తమైన ఆదర్శం
అద్భుతమైన నటన
అన్నీ మంచి అలవాట్లు
కలబోసిన దసరా బుల్లోడు
మూగమనసుల దోచినోడు
తెలుగు సినిమా సక్కనోడు
తారై వెండి తెరపై వెలిగిన
మన అందరి ఎ ఎన్ అర్
అసువులుబాసి, ఆకసాన
సుక్కై(తారై) నిలిచి పోయే
వెన్నెల్లో.. జాబిల్లికి తోడై
అక్కినేని ఆత్మశాంతికై ప్రవాసాన తెలుగు వారి నివాళి
అశ్రునయనాలతో ఆ మహా మనిషికి మా శ్రద్ధాంజలి ...