28, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగు పాటలు..


తెలుగు పాటలు..
==========

తల్లిలాంటి  మన తెలుగు భాషను సేవించగరండీ 
మధురమైన మన మాతృభాషను మరచిపోకండి 
తెలుగు తెలుగు తెలుగూ ధరణిలో కలిసిమెలసి మెలుగూ
తెలుగు తెలుగు తెలుగూ ప్రతి మదిని మదిని వెలుగూ         || తల్లిలాంటి ...||

తల్లీ, తండ్రీ , గురువూ
దైవసమానులు మనకు
అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు
ఆత్మీయతలకు నెలవూ
అత్త, మామ, అల్లుడు, కోడలు 
బంధువు బాంధవ్యాల 
మేలుకలయికే తెలుగు కుటుంబం 

భాషకు వడి, వడి నడకను నేర్పి
తీర్చిదిద్దిన తెలుగు కవులు
నన్నయ, తిక్కన ఎర్రాప్రగడ 
భాషకు, భావం చేర్చి రాగం కూర్చి 
గానం చేసిన గానగంధర్వులు 
త్యాగయ, క్షేత్రయ, అన్నమయా
జాతికి నీతి, నడవడి తెలిపే 
జీవితగమన నిర్దేశిత వచనాలు 
వేమన పద్యం, సుమతీ శతకాలు 

ప్రాంతం ఏదైనా ప్రజలంతా ఒక్కటనీ 
మతమేదైనా, తెలుగే మతమనీ 
మనుషులనేకంచేసే, మమతలనెలవైన
అమ్మలాంటి మనసున్న కమ్మనైన భాష మనది
ఏ దేశమేగినా ... ఎలుగెత్తి చాటుదాం 
ప్రతి మదిలో తెలుగువెలుగులు నింపుదాం..      || తల్లిలాంటి ...||
*******************************


బాలలం... బాలలం  తెలుగుబాలలం 
ప్రవాసాన తెలుగుతల్లి పసిడిపువ్వులం  || బాలలం.. ||

అనురాగం ఆత్మీయత  
నిండైన మనసుతోడ  
మమత పంచు మల్లెలం
చల్లని వెన్నెల కలువలం                     || బాలలం.. ||

భావితరం పౌరులమ్
భాషా దివిటీలమ్ 
తెలుగు అక్షరానికి
రక్షణగా మేముంటాం                         || బాలలం...||

మా మతం అందరి హితం
తెలుగే మా అందరి కులం 
జగడాలకు కడు దూరం 
విశ్వశాంతి కాముకులం                    || బాలలం....||


22, డిసెంబర్ 2012, శనివారం


అకృత్యం                      
( స్త్రీల పై దాడులు అమానుషం )
--------------------------------

నవమాసాలు నిను మోసి 
తను హరిస్తూ, పెంచే అమ్మై
రక్త సంభందం రక్షను కోరి 
ఆత్మీయతను అందించే అక్కై
అనురాగం పంచే చెల్లెలై..
సుఖ సంతోషాలనిస్తూ
సతిగా, శరీరంలో సగమై   

ఉన్నతమై ... ఉదాత్తమై.!
ఆజన్మాంతం రుణపడాల్సిన 
మాతృమూర్తి, దైవస్వరూపం.. స్త్రీ!

ప్రపంచీకరణమనే పరుగులో.
అదుపుదప్పి, అవధులుదాటి
ఇప్పటి జనజీవనం అరణ్యమై 
సమాజంలో నైతికత మృగ్యమై 
మానసికరోగాలతో మనిషి మృగమై

విలువల వలువలనిప్పేసి 
నగ్నంగా, నిర్భాగ్యపు పోకడలతో 
నీతిమాలిన సంస్కృతీ సాంప్రదాయాలతో 
వావి వరసలులేని వికృతమైన
విష వ్యవస్థల ఫలితమే... ఈ అకృత్యం 

అమానుషం, అత్యంత హేయం.. శోచనీయం 
సమాజానికి సిగ్గుచేటు, నాగరికతకిది గొడ్డలిపెట్టు  
ఇప్పుడైనా.. మేల్కొనండి, కళ్ళుతెరవండి.
అనాదిగా మన సంస్కృతిలో ఉన్న 
సభ్యతా, సంస్కారాల వాకిళ్ళు తెరవండి
విలువివ్వండి .... పాటించండి
భావితరాలకు తెలియజేయండి,
ఇది మన బాధ్యత, ధర్మం.!

(ధర్మో రక్షిత రక్షితః = ధర్మాన్ని రక్షించండి ..అది మిమ్మల్ని కాపాడుతుంది)

15, డిసెంబర్ 2012, శనివారం

నా ఆలోచనా సులోచనాలతో నా చుట్టూ ఉన్న చిన్న ప్రపంచాన్ని వీక్షించి, సమీక్షించి తెలుగు పదాలతో కూర్చిన కవనాలు ఈ కవితా సుమాలు ...


యుద్ధం
======

ఏ చరిత్ర పుటలు త్రిప్పిన
చరమాంకం యుద్ధమే !
ప్రతి యుద్ధం పరమార్ధం ఒక్కటే
అదే.. ఎవరో ఒకరి (కొంతమంది) స్వార్ధం

వెరసి సమస్త మానవజాతి
బలిదానం, మారణహోమం
ఎందుకు జరుగుతోందిలా.. ?
ఆలోచనలేక..? అవగాహనలేకా ..?
లేక, ప్రాణం విలువ తెలియకా..?

అర్థం కాని విషయమేంటంటే
ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంటుంది
మరోప్రక్క క్షతగాత్రులకు రెడ్ క్రాస్
సేవలు జరుగుతూ ఉంటాయి

అదో (యుద్ధ) రాక్షస క్రీడ...
ఎందుకు ఒకరినొకరు చంపుకోవడం
గాయాలు నయం చేసుకోవడం


చిన్న చిన్న తగవులే
ఇంతై, అంతై.... ఇంతంతై
ప్రళయానికి పరాకాష్టలవుతున్నై!

ఎవరు టెర్రరిస్ట్?, ఎవరు నక్సలైట్?
మాటలకర్థం మారిపోయి
మనుషులలో మానవత్వం ఇరిగిపోయి
మతాన్ని మత్తు మందులా సేవిస్తూ
ప్రపంచాన్ని రక్తసిక్తం చేస్తూ..
ప్రజను భయభ్రాంతం చేస్తోంది

ఎక్కడైనా, ఎప్పుడైనా
ఏప్రాంతంలోనైనా, ఏదేశంలోనైనా చూడండి.
మనిషికున్న స్వార్థం మహమ్మారిలా మారి
మతం ముసుగులో ప్రాంతీయతా పరదాల వెనుక
ఎన్నో, ఎన్నెన్నో జీవితాలను కబళించివేసి
మ్రుతకళేబరాలను చిహ్నంగా మిగిలిస్తుంది

అధికార దాహార్తిని, రక్తంతో తీర్చుకొనే
ఈ మానవ మృగాలను, వేటాడి
మట్టుపెట్టే వేటగాడికన్నా, మచ్చికచేసి
మంచిమార్గాన నడిపే మావటికావాలి

మంచితనం అనే అంకుశాన్ని,  వారి
మస్తిష్కంలో దించి, మానవతా విలువల్ని
పెంచే, మహనీయులు ఉద్భావించాలి
అపుడే, ప్రపంచానికి శాంతి, సౌఖ్యం...



డబ్బు 
=====

ఒక నిండు జీవితాన్ని,
ఆడించేది, ఓడించేది, ఏడిపించేది  డబ్బే...!

ఈ డబ్బే స్వార్థమనే మబ్బుతో
మనిషి మనసుని కప్పేసి, జీవితమనే
అనంతాకాసాన్ని శూన్యం చేస్తుంది .

ఎందుకో ఈ మానవ సంబంధాలు ?

తల్లి, తండ్రి, అక్క, అన్న
చెల్లి, తమ్ముడు, భార్య, భర్త
అత్త, మామ, అల్లుడు, కోడలు

ఎవరికి ఎవరు అవసరం..?
అంతా భూఠకమ్ !
అందరికీ డబ్బే అవసరం.
అదుంటే, ఆనందం ఆహ్లాదం

ఒకడేమో డబ్బు ఎక్కువై చస్తాడు..
మరొకడు డబ్బు లేక చస్తాడు
మరణానికి చిరునామా డబ్బే..

కాని ప్రతి ఒక్కరికీ
అంతులేని ఆనందాన్నిచ్చేది
నిస్వార్ధపూరితమైన ఓ మనస్సు
ఆ మంచి మనసుగల అమ్మే ... మథర్ థెరిస్సా.

" A life not lived for others is not a life"  --- Mother Teresa

(అల్లాంటి అమ్మలు ఎంతో మంది ఉండవచ్చు వారికందరికీ పై కవిత వర్తించదు.. డబ్బుకు ఇప్పటి కాలంలో ఇస్తున్న ప్రాముఖ్యతను ఉద్దేసించి వ్రాసిందే కాని అన్యదా భావించవద్దని చదువరులకు  మనవి )



వాలు జడ 
=======

ఒకప్పుడు ....
పడతుల వయసు వయ్యారాన్ని వివరించేది  ఓ  వాలు జడ

మగువపై మగని మనస్సు నియంత్రించే కనికట్టు 
నల్లటి కురులు పొందికగా  అల్లిన  ఆ జుట్టు

మరిప్పుడు ....

కలం పెన్ అయి
కాగితం పేపర్ అయింది  
నీళ్ళు వాటర్ అయి 
అమ్మ,  మమ్మీ  అయిపోయిన .. ఈ రోజుల్లో 

వాలుజడ వ్వాట్ ? అంటూ ..l
కాలమనే వ్యాకరణముతొ మారి

స్టైల్ గా , "పోనీటెయిల్ " గా 

వీలైన జుట్టుగా.. "వీలుజడగా" మారింది 
ప్చ్  !... పాపం వాలుజడ .



ప్రవాసం 
======

పరదేశంలో పైసల కోసం 
ప్రవాసజీవనం మేలని ఎంచి 
ఆప్యాయతలను తెంచుకొని
అనుభూతులను అణచుకొని
అవసరాలను పెంచుకొని
అన్న్యోన్యతలను అంతమొందించి 
నూన్యతాభావమ్ నెత్తికెత్తుకొని 
స్వార్ధం మెట్లతో మేడలు గట్టి 
గౌరవ మర్యాదల గోడలుగట్టి
మనిషన్నోడిని మనీతొవెలగట్టి 
కన్నుగానక మరి మిన్నుకెగిరి
వెతలలోన బడి,  విషయం మరచి 
ప్రవాసంలో భారతీయుడు 
భాషను విడిచి, భావం మరచి 
వెలగబెట్టిని వింతేమిటంటే 
పరాయి భాషపై పట్టుకుదరక 
మాతృభాష మరుగున పడగా 
భాషించడంలో అనుభూతిలేక
ఆత్మానందం కోరవడగా....

ప్రయత్నపూర్వకంగా అయినా,  తన
మాతృభాషలో మాట్లాడడెన్దుకో ?
అది అమృతతుల్యమైన తన 
అమ్మభాషని ఆలోచించడెన్దుకో ..?



తెలుగు పాటలు..
==========

తల్లిలాంటి  మన తెలుగు భాషను సేవించగారండీ
మధురమైన మన మాతృభాషను మరచిపోకండి 
తెలుగు తెలుగు తెలుగూ ధరణిలో కలిసిమెలసి మెలుగూ
తెలుగు తెలుగు తెలుగూ ప్రతి మదిని మదిని వెలుగూ         || తల్లిలాంటి ...||

తల్లీ, తండ్రీ , గురువూ
దైవసమానులు మనకు
అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు
ఆత్మీయతలకు నేలవూ 
అత్త, మామ, అల్లుడు, కోడలు 
బంధువు బాంధవ్యాల 
మేలుకలయికే తెలుగు కుటుంబం 

భాషకు వడి, వడి నడకను నేర్పి
తీర్చిదిద్దిన తెలుగు కవులు
నన్నయ, తిక్కన ఎర్రాప్రగడ 
భాషకు భావం చేర్చి, రాగం కూర్చి 
గానం చేసిన గానగంధర్వులు 
త్యాగయ, క్షేత్రయ, అన్నమయా
జాతికి నీతి, నడవడి తెలిపే 
జీవితగమన నిర్దేశిత వచనాలు 
వేమన పద్యం, సుమతీ శతకాలు 

ప్రాంతం ఏదైనా ప్రజలంతా ఒక్కటనీ 
మతమేదైనా, తెలుగే మతమనీ 
మనుషులనేకంచేసే, మమతలనెలవైన
అమ్మలాంటి మనసున్న కమ్మనైన భాష మనది

ఏ దేశమేగినా ... ఎలుగెత్తి చాటుదాం 
ప్రతి మదిలో తెలుగువెలుగులు నింపుదాం..      || తల్లిలాంటి ...||
*******************************



బాలలం... బాలలం  తెలుగుబాలలం 
ప్రవాసాన తెలుగుతల్లి పసిడిపువ్వులం  || బాలలం.. ||

అనురాగం ఆత్మీయత  
నిండైన మనసుతోడ  
మమత పంచు మల్లెలం
చల్లని వెన్నెల కలువలం                     || బాలలం.. ||

భావితరం పౌరులమ్
భాషా దివిటీలమ్ 
తెలుగు అక్షరానికి
రక్షణగా మేముంటాం                         || బాలలం...||

మా మతం అందరి హితం
తెలుగే మా అందరి కులం 
జగడాలకు కడు దూరం 
విశ్వశాంతి కాముకులం                    || బాలలం....||