29, జులై 2018, ఆదివారం

N “light” (Treat) menT

—————////———-
14 సంవత్సరాలక్రితం
ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేప్పుడు
డాలర్ పడిపోతే బావుండనుకొన్నా

14 సంవత్సరాల తరువాత
ఇండియాకి వెళ్ళాలనుకొంటూ
రూపాయి పడిపోవాలనుకొంటున్నా  ...
విచిత్రం ! కాదు కాదు, స్వార్థం!

అసలు విషయమేంటంటే ?
ఈ మధ్యలో, వయసు పైబడి
తెల్లెంట్రుకలు ఎక్కువై,
కంటద్దాల పవర్ పెరిగి
ఎముకల పటుత్వం తగ్గి,
నరాల్లో సత్తువ నశించి

అన్నీ తినలేక, తిన్నా అరగక
నిద్ర చిధ్రమై, ఆసలు చావక,
ఏదేదో సాధించాలనీ, ఏమీచేయలే
అరే! ఇది,మిడిల్ ఏజ్ క్రైసిస్. ఇపుడెలా..?
అని, అతి త్వరగ గుర్తించి...

తిక్క సన్నాసిని, వేదాంతం వైద్యమనుకొని
మిడి మిడి జ్ఞానంతో , మెదడుకు మైనం పూసుకొని
గీత ముందేసుకొని, నా గజిబిజి మనసును
ఒక గీతలో పెట్టమని, దేవుడ్నడిగితే ఎలా?

సరిగ్గా అప్పుడే ... అదిగో!
నా అంతరాత్మ( ఆకాశవాణి) చెప్పింది… ఇలా !

“నీలో మనిషిని గుర్తించి
మానవత్వంతో మెసలి
జ్ఞానమనే దివ్వెను వెలిగిస్తే
మెదడున మైనంకరిగి
కొవ్వొత్తిలా.. దారి చూపి
కొందరికైనా సహాయపడి
నీ జన్మను  సార్ధకం చేసుకో … వృద్ధాప్యంలో...!”

If you know how to lighten desires and tight situations, early in your  life....  you are “enlightened”..!

27, జులై 2018, శుక్రవారం

ఏ పాటి?

ఎవరు ఏ పాటి?
తెలిసిందేపాటి? ఎరుకైందేపాటి?
ఎవరికి ఎవరు సాటి?
ఎవరెవరి మధ్య ఈ పోటీ?

ఒకడేమో సహపాటి
మరొకడు ఘనాపాటి
ఇప్పుడింకొకడు తయారు!

వ్యాపారంలో లాభం రాక
ఉద్యోగంలో రాదనా రూక
మనుషుల్లో బలహీనత
ఎంచక్కా  గమనించాక
పట్టాడీ ప్రవచనాల బాకా..!

వినేవాడికి చెప్పేవాడు లోకువన్నట్టు
ఇతగాడు చెప్పే నీతులు
తీసే కులాల లోతులు
ఆతని సమాజ రీతులు
ప్రజాస్వామ్యానికి గోతులు
రాజ్యాంగ వ్యతిరేక కారకాలు
ఇతడు ఛాందస భావాల
ముసుగులో కుహనా పాటి
డబ్బుకు గడ్డితినడమే పరిపాటి.

సంభావనలేకుండా ఒక్క ప్రవచనం
చెబుతారేమో చూడండి?
కులం హలంనుండి పెల్లుబికిన
సనాతన మురికే ఈ గడ్డిపాటి
తస్మాత్ ! జాగ్రత్త !!

 ఎవరిది ఏ స్థాయి?
నిర్ణయించడానికి, వీరికెక్కడిదా స్థాయి?
ఎవరిక్కడ, ఎప్పటికీ చిరస్ధాయి?
మనుషుల్లో హెచ్చు తగ్గులు
పుట్టుకతో ఎలా వస్తాయి ?
కొందరికే, అవెలా తెలుస్తాయి?


నాటికి, నేటికీ
తమ స్వార్థంకై
మాట మాటకీ
శ్లేషను, విశ్లేషణను
పురాణఇతిహాసాలను
ఇప్పుడు, కొత్తగా ప్రవచనాలని
నీతని, నేతిమాటల చెప్పి
పట్టు పీతాంబరాలతో
ఒకింత సాంకేతికత
జోడించి, జూ లక టక
మాటల మూటలను
గంటల పంచాంగాలతో
వాస్తు అవాస్తవాలతో
తిమ్మిని బిమ్మిని చేసే
మాటల గారడీలతో
హిందుత్వ అజెండాల
మతతత్వ అధికార అండతో

అమ్మని, సరస్వతమ్మనీ
అమ్ముకొని, పబ్బంగడుపుకొనే
వ్యాపారం ఊపందుకొంది.
మానవుల, మనువు బానిసల
చేసే పర్వం ఆరంభమైంది
ఈ ఇరవయ్యొకటో శకంలో

మేలుకో, ఓ యువతా మేలుకో!!
ఈ జగతి జాగృతికై
విచక్షణతో వీక్షించి, ప్రశ్నించి
సమాధానపడి, సంయవనంతో
ప్రపంచాన్ని గమనించి నడుచుకో!
నీ జీవన గమనం మెరుగుపరుచుకో!!
మానవత్వంతో ప్రపంచాన్ని గెలుచుకో !!!

Left Hand (left behind)

దక్షిణ రాష్ట్ర హోదా
----------------------
దేహంలో భాగమైన,
ఎడమ చేయి ఎప్పుడూ
మెదడుకు  మానసికంగా
ఎంతైనా కొంత దూరమే
దక్షిణ రాష్ట్ర హోదా పోరుతో
ఆ కుడి ఎడమల తేడా తెలిసిందా?

పురాణ ఇతిహాసాల్లోనూ
జాతి, నిజాయితీల పరంపరల్లోనూ
కృత, త్రేతా, ద్వాపర, కలి
యుగయుగాలుగా ప్రక్కన పెట్టేసి,
అసురుల్ని, అధముల్ని చేసి
మాలో అనైక్యతనే ఆయుధంగా చేసుకొని
అశుద్దాన్ని కడిగేందుకు మాత్రమే,
సమైక్య భారతావనికి, ఉపయోగపడిందా? దక్షిణం.!


ఉత్తరాది నుండి అరువు
తెచ్చుకొన్న ఆ దేవుళ్ళు
రాముడైనా ?, కృష్ణుడైనా ?
ఉత్తరాన తెలుపులో
దక్షిణాదిన నలుపులో
రంగుల్లో ఆ తేడాలేందో?


దక్షిణాదిని రాజ్య విస్తరణకై
మోసపూరిత యుద్ధ తంత్రాలతో
వాలిని చంపి సుగ్రీవునికి
రావణుని చంపి విభీషణునికి
స్వతంత్రుల సామంతుల చేసి
వదినలను, మరుదులతో
నీచంగా వివాహమొనరించి
లక్ష్మణునికేమో సీతను తల్లిని చేసి
నీచ సంస్కృతి మాదని  ప్రవచించి
దక్షిణ పై వివక్ష చూపిన పురాణ తప్పిదం !


ఇప్పటికైనా ..,,

మనమంతా భారతీయులం
మనదంతా భరత జాతనే
అపోహనుండి బయటకురండి!

మనమంతా వివిధ తెగల, భాషల
ప్రాంతాల, నాగరికతల ప్రజలమని
ఆ వైరుధ్యాలన్నీ తెలిసి, కలిసుండే
ఉత్తర, దక్షిణ, మధ్య ప్రజలమని
గ్రహించి, అభివృద్ధిని కాంక్షించి
సమతుల్యం పాటించి, సమంగా
విభజించి  పాలించుకొంటేనే
ఈ ప్రజాస్వామ్యాన ఐక్యత, సఖ్యత.

మార్పు (CHANGE)


మార్పు,
నిప్పులాంటి  నిజం.
మనం ఔనన్నా, కాదన్న
అమ్మ గర్భం నుండే ఆరంభం,
మన పుట్టుకతో ప్రారంభం.

కాలం మార్పుకు సూచిక,
ప్రక్రుతి, మనిషిప్రవృత్తే గమనిక.
సమాజంలో మార్పు అత్యంత సహజం
మనిషి, కోతి నుండి వచ్చాడని
కొందరంటారు, మరికొందరు కాదంటారు
స్వాగతించాలి, సహేతుక వ్యతిరేకతలను.

అది
మత మైనా, మతగ్రంధమైనా
వేదమైన, ఇతిహాసమైనా
నియమమైనా, ఆచారమైనా
సమూహమైనా, సమాజమైనా
సంస్కృతయినా, నాగరికతైనా

మార్పుకు నోచుకోకపోతే
అంతరించడం ఖాయం
గత సంస్కృతులు, నాగరికతలే
ఇందుకు ముఖ్య ఉదహరణ.

సమాజ హితంకోరి, మానవ హక్కులకై
దురాచారాలను, గుడ్డి నమ్మకాలను
ఎండగట్టి సంఘ బహిష్కరణకు గురై,
మానవవికాసానికై  అశువులు బాసిరి
మహానుభావులెందరో జన జాగృతికై

ఆ మార్పుకు ప్రతీకలం మనం !

ఈ తరం ద్వేషించి భహిష్కరించినా,
నిక్కచ్చిగా రేపటి తరం స్వాగతించేది,
ఆమోదించి పాటించేది  ఆమార్పునే
మార్పును స్వాగతించలేని వాడు
ఎంత జ్ఞానం సముపార్జించినా అజ్ఞానే
(CHANGE IS INEVITABLE, GROWTH IS OPTIONAL.)