తెలుగు అక్షరం
------------------
సత్యం, ధర్మం దర్శనాన నిదర్శనమై
మంచి, చెడు నిజ నిర్ధారణల హేతువై
మనిషి మేధోమధనానికి మాత్రుకై
నిత్యనూతనమై ఎల్లపుడూ ఓ జాతి
మనుగడకు భాషై, మాతృమూర్తిలా
మనిషి మనసు పొరల్లో పెనవేసుకొని
ఆలోచనల ఆకసాన నక్షత్రమై వెలిగి
భవితకు బాటను వేసే మాటై మిగిలి
ఆటై, పాటై, పాదాల పెదాల నృత్యం చేసి
జీవన గతిని మార్చే చరిత్ర పుటల్లో
మానవ హితంకోరే మత గ్రంధాలలో
అన్నిటికన్నా మిన్నగా మనందరి
ఆత్మీయతానురాగాల మదిగదిలో
నిక్షిప్తం, సురక్షితం, తెలుగు అక్షరం