తెలుగు పాటలు..
==========
తల్లిలాంటి మన తెలుగు భాషను సేవించగరండీ
మధురమైన మన మాతృభాషను మరచిపోకండి
తెలుగు తెలుగు తెలుగూ ధరణిలో కలిసిమెలసి మెలుగూ
తెలుగు తెలుగు తెలుగూ ప్రతి మదిని మదిని వెలుగూ || తల్లిలాంటి ...||
తల్లీ, తండ్రీ , గురువూ
దైవసమానులు మనకు
అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు
ఆత్మీయతలకు నెలవూ
అత్త, మామ, అల్లుడు, కోడలు
బంధువు బాంధవ్యాల
మేలుకలయికే తెలుగు కుటుంబం
భాషకు వడి, వడి నడకను నేర్పి
తీర్చిదిద్దిన తెలుగు కవులు
నన్నయ, తిక్కన ఎర్రాప్రగడ
భాషకు, భావం చేర్చి రాగం కూర్చి
గానం చేసిన గానగంధర్వులు
త్యాగయ, క్షేత్రయ, అన్నమయా
జాతికి నీతి, నడవడి తెలిపే
జీవితగమన నిర్దేశిత వచనాలు
వేమన పద్యం, సుమతీ శతకాలు
ప్రాంతం ఏదైనా ప్రజలంతా ఒక్కటనీ
మతమేదైనా, తెలుగే మతమనీ
మనుషులనేకంచేసే, మమతలనెలవైన
అమ్మలాంటి మనసున్న కమ్మనైన భాష మనది
ఏ దేశమేగినా ... ఎలుగెత్తి చాటుదాం
ప్రతి మదిలో తెలుగువెలుగులు నింపుదాం.. || తల్లిలాంటి ...||
*******************************
బాలలం... బాలలం తెలుగుబాలలం
ప్రవాసాన తెలుగుతల్లి పసిడిపువ్వులం || బాలలం.. ||
అనురాగం ఆత్మీయత
నిండైన మనసుతోడ
మమత పంచు మల్లెలం
చల్లని వెన్నెల కలువలం || బాలలం.. ||
భావితరం పౌరులమ్
భాషా దివిటీలమ్
తెలుగు అక్షరానికి
రక్షణగా మేముంటాం || బాలలం...||
మా మతం అందరి హితం
తెలుగే మా అందరి కులం
జగడాలకు కడు దూరం
విశ్వశాంతి కాముకులం || బాలలం....||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి