ప్రేమికుల రోజు
---------------------
నువు నచ్చిన ఆ సిగ్గే మొగ్గై
నువు మెచ్చిన ఆ నవ్వే పువ్వై
ప్రకృతిని మరచి నీకై విరబూసి
ప్రేమ పరిమళం వెదచల్లే రోజు
ప్రేయసి, ప్రియ స్పర్శలో సేదదీరి
ప్రేమికుల ప్రణయానికి బాటలువేసి
తరియించి తనువు చాలించాలని
అందమైన రోజా, పోటీపడే రోజు
ప్రేమదేశానికి ప్రియుడీ రోజున రాజై
ప్రణయ మాగాణికి ప్రేయసి రాణై
ప్రేమ ప్రపంచాన జరుపుకునే సంబరం
అంబరాన్నంటే అంగరంగ వైభవం
******(వయసులో ఉన్న, వయసుపైబడ్డ మరియు వయసుమీరిన
ప్రేమను ప్రపంచాన సజీవపరుస్తున్న ప్రేమికులకు ఈ కవిత అంకితం,) ******
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి